తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు - ఐపీల్ వార్తలు

IPL 2022: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సాధించాడు లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​. నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

KL Rahul
కేఎల్ రాహుల్

By

Published : May 26, 2022, 1:53 PM IST

KL Rahul: లఖ్​నవూ జట్టు కెప్టెన్​ కేఎల్ రాహుల్​ ఐపీఎల్​లో​ సరికొత్త రికార్డు సృష్టించాడు. నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆర్​సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 58 బంతుల్లో 79 పరుగులు చేశాక రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ సీజన్​లో మొత్తం 15 మ్యాచ్​లు ఆడి 661 పరుగులు చేసి టాప్​ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.

కేఎల్ రాహుల్

IPL Records: 2021 ఐపీఎల్​లో పంజాబ్​ తరఫున 13 మ్యాచ్​లు ఆడిన రాహుల్​ 626 పరుగులు చేశాడు. 2020 సీజన్​లో 14 మ్యాచ్​లు ఆడి 670 పరుగులు, 2018లో 659 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్​లో నాలుగు సార్లు 600ప్లస్ పరుగులు చేసిన తొలి ప్లేయర్​గా అవతరించాడు. రాహుల్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరిద్దరు మూడు ఐపీఎల్​ సీజన్లలో 600కుపైగా పరుగులు చేశారు.

IPL News: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్​ ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు 2011, 2012, 2013 సీజన్లలో వరుసగా 600కుపైగా పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సన్​రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించినప్పుడు 2016, 2017, 2019 సీజన్లలో 600కుపైగా పరుగులు చేశాడు. ఇప్పుడు రాహుల్ నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించడం వల్ల వీరిద్దరు రెండో స్థానానికి పరిమితమయ్యారు.

కేఎల్ రాహుల్

IPL Eliminator: బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్​లో ఆర్సీబీ చేతిలో లఖ్​నవూ ఓడిపోయింది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 193 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్ వేదికగా మే 27న జరిగే క్వాలిఫయర్​ 2 మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​తో తలపడనుంది ఆర్​సీబీ. ఈ మ్యాచ్​లో గెలిచిన వారు మే 29న ఫైనల్​లో ఢీకొంటారు. ఈ మ్యాచ్​ కూడా అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతుంది.

ఇదీ చదవండి:వేలంపాటలో రూ.20లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడు అతడే హీరో..

ABOUT THE AUTHOR

...view details