KL Rahul Axar patel injured: టీమ్ఇండియా ప్లేయర్స్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్సర్ పటేల్ వెస్టిండీస్‌తో జరగాల్సిన టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హూడాకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ. నేడు(శుక్రవారం) విండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఎడమకాలు కండరాల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతడు అందుబాటులో ఉండట్లేదు. ప్రస్తుతం అతడికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత బెంగళూరలోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించనున్నారు.
IND VS WI: టీ20 సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం - ind vs westindies
KL Rahul Axar patel injured: వెస్టిండీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ఇండియా కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు టీ20 సిరీస్‌కు దూరంకానున్నాడు. ఇక కరోనా నుంచి కోలుకున్న అక్సర్ పటేల్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు. వీరిద్దరి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హూడా ఆడనున్నారు.
కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్ దూరం
ఇక వన్డే సిరీస్ ఆరంభానికి ముందు అక్షర్ పటేల్, ధావన్, శ్రేయస్ అయ్యర్ కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ అక్షర్ ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించబోతున్నట్లు తెలిపింది బోర్డు. అందుకే అతడిని సిరీస్‌కు దూరం ఉంచినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: IND VS WI: శ్రేయస్, పంత్ అదరహో.. విండీస్ లక్ష్యం ఎంతంటే?
Last Updated : Feb 11, 2022, 7:26 PM IST