Kl Rahul Against South Africa :భారత్-సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభమైంది. టాస్ గెలిచి ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. పూర్తిగా పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) విఫలం కాగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (38) ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ 200 మార్క్ అందుకోవడం కష్టమే అనిపించింది. ఈ దశలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. క్రీజులో నిలదొక్కుకొని స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 208-8తో నిలిచింది.
అయితే సౌతాఫ్రికా పిచ్‌ల్లో టీమ్ఇండియాకు వెన్నుముకలాగా నిలుస్తున్నాడు రాహుల్. గత పర్యటనలోనూ డీసెంట్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2021 సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ 123 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 113 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్‌లో 146 పరుగులు చేసిన రాహుల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక అదే పర్యటనలో జొహెన్నస్‌బర్గ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 49-3 తో నిలిచిన టీమ్ఇండియాను ఆదుకున్నాడు. 133 బంతుల్లో 50 పరుగులు చేసి వికెట్ల పతనాన్ని అడ్డుతున్నాడు. కానీ, ఆ తర్వాత పుంజుకున్న సఫారీలు భారత్‌ను 202 పరుగులకు ఆలౌట్ చేశారు.