టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో(Ind vs Pak T20 World Cup) తలపడడానికి ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు(team india warm up match) ఆడనుంది టీమ్ఇండియా. సోమవారం(అక్టోబర్ 18న) ఇంగ్లాండ్‌తో, బుధవారం ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన(Team India Squad for T20 World Cup) ముందు పలు సవాళ్లున్నాయి. రెండో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు కేఎల్ రాహుల్ వస్తాడా? యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ వస్తాడా? అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫామ్‌లో లేనందున అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్నదానిపై స్పష్టత లేదు. ఈ సందర్భంగా సారథి కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్లో 626 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు, ఓపెనర్ రోహిత్ శర్మతో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ కూడా ముంబయి ఇండియన్స్ తరఫున చివరి రెండు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను రెండో ఓపెనర్‌గా పంపిస్తే.. హార్దిక్ పాండ్య ఫినిషర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంటుంది.
బౌలింగ్‌లో రవీంద్ర జడేజాతో కలిపి ఇద్దరు స్పిన్నర్లు ఆడనున్నారు. ఫిట్నెస్తో ఉంటే వరుణ్ చక్రవర్తికి తప్పకుండా జట్టులో చోటు ఉంటుంది. మరో స్పిన్నర్‌గా అశ్విన్ లేదా రాహుల్ చాహర్‌కు అవకాశం లభించనుంది. ఇద్దరు స్పిన్నర్లే జట్టులో ఉంటే ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమర్లకు ఇద్దరికీ అవకాశం వస్తుంది.
బట్లర్‌పైనే ఆశలు..
ఇంగ్లాండ్ జట్టులో జాస్ బట్లర్ కీలక ఆటగాడు కాగా.. బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో కూడా ఆడుతున్నారు. అయితే.. ఐపీఎల్లో లివింగ్‌స్టోన్ బ్యాటింగ్‌లో తడబడ్డారు. కోల్‌కతా కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ రాణించినప్పటికీ.. పరుగులు చేయడంలో విఫలమయ్యాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
జట్లు (అంచనా)
టీమ్ఇండియా:విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య
ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), మొయిన్ అలీ, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.
ఇదీ చదవండి: