యువ క్రికెటర్ రిషభ్ పంత్.. టీమ్ఇండియా భవిష్యత్ కెప్టెన్ అని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డారు. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపారు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన అనుభవం అతనికి పనికొస్తుందని పేర్కొన్నారు.
"రిషభ్ పంత్.. భవిష్యత్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సారథికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పంత్‌కు ఉన్నాయి. అతడి కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే ప్రారంభంలో చాలా ఒడుదొడుకులు కనిపిస్తాయి. మొదట్లో అతడు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల వల్లే అతడు మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తొలుత ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. టీ20లతో పాటు వన్డేలకూ జట్టులోకి తీసుకోలేదు. కానీ, అతడు అనూహ్యంగా టెస్టు ఫార్మాట్ ద్వారా టీమ్‌లోకి వచ్చాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు."