ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. క్రికెట్లో మార్పులు చేయాలని సూచించాడు. టీ20ల్లో 100 మీటర్ల కంటే దూరం సిక్స్ కొడితే 12 పరుగులు ఇవ్వాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. తమ దేశ క్రికెట్ బోర్డు ప్రారంభించనున్న 'ది హండ్రెడ్ లీగ్'లోనూ ఈ రూల్ను అమలు చేయాలని సూచించాడు.
100 మీటర్ల సిక్సర్ బాదితే 12 పరుగులు!
100 మీటర్ల కంటే దూరం సిక్స్ బాదితే 12 పరుగులు ఇవ్వాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. తమ దేశ క్రికెట్ బోర్డు ప్రారంభించనున్న 'ది హండ్రెడ్ లీగ్'లోనూ ఈ రూల్ను అమల్లోకి తీసుకురావాలని సూచించాడు.
కెవిన్ పీటర్సన్
పీటర్సన్.. కెరీర్లో 104 టెస్టులు(8181 పరుగులు, 23 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు), 136 వన్డేలు(440, 9 శతకాలు, 25 అర్ధ శతకాలు), 37టీ20లు(1176 పరుగులు) ఆడాడు. ఇక ఐపీఎల్లోనూ 36 మ్యాచ్లు ఆడి 1001 పరుగులు చేశాడు.