తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లాదేశ్​తో మ్యాచ్​.. దినేశ్ కార్తీక్​ వర్సెస్​ పంత్​.. ఆడేది ఎవరో? - t20 worldcup dinesh karthik

టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో గాయపడిన దినేశ్ కార్తీక్​.. బంగ్లాదేశ్​తో జరగబోయే మ్యాచ్​కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అతడి స్థానంలో పంత్ ఆడొచ్చని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. ఏం అన్నారంటే..

dinesh karthik injured
దినేశ్​కార్తీక్​కు గాయం పంత్​కు ఛాన్స్​

By

Published : Oct 31, 2022, 4:07 PM IST

Updated : Oct 31, 2022, 4:35 PM IST

టీ20 ప్రపంచకప్​కు ముందు టీమ్​ఇండియా ఆటగాళ్లను వేధించిన గాయాల బెడద.. మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా బూమ్రా మెగాటోర్నీకి దూరం కాగా.. తాజాగా దినేశ్​ కార్తీక్ కూడా గాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచుల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ వెన్ను గాయానికి గురయ్యాడు. మ్యాచ్​ మధ్యలోనే మైదానాన్ని వీడగా పంత్​ను ఆడించారు. దీంతో తర్వాతి మ్యాచ్​లకు దినేశ్​ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. నవంబర్ 2న బంగ్లాదేశ్​తో జరగనున్న మ్యాచ్​కు అతడు దూరమయ్యే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు.

"కార్తిక్​ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు మునపటిలో ఫిట్​గా ఉండేందుకు.. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే అతడిని ఆడించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదు." అని బోర్డు అధికారి అన్నారు. కాగా, బంగ్లాతో జరగబోయే మ్యాచ్​లోనూ కార్తిక్​ స్థానంలో పంత్​ను తీసుకోవాలనే డిమాండ్​లు వినిపిస్తున్నాయి. దీంతో అతడినే తీసుకోవాలని మేనేజ్​మెంట్​ భావిస్తోందని తెలుస్తోంది.

ఇక పాకిస్థాన్​ జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు మాత్రమే చేసిన దినేష్‌ కార్తీక్‌... దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఫినిషర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న అతడు ఆస్ట్రేలియా పిచ్‌లపై పెద్దగా రాణించలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌ల్లో రిషబ్‌ పంత్‌కు అద్భుత రికార్డు ఉంది. కార్తీక్‌తో పోలిస్తే కొన్ని షాట్లను పంత్‌ మెరుగ్గా ఆడగలడు. ఓపెనర్‌ కేఎల్​​ రాహుల్‌ కూడా టీ20 ప్రపంచకప్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమవడవంతో అతని స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకుని ఓపెనర్‌గా పంపాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. పంత్‌ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కావడం కూడా అనుకూలించే అంశం.

రెండో స్థానంలో.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్​, నెదర్లాండ్స్‌పై గెలుపొందిన టీమ్​ఇండియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గ్రూప్‌-2లో రెండోస్థానంలో నిలిచింది. ప్రతిగ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

ఇదీ చూడండి:ధోనీ తుపాన్ ఇన్నింగ్స్​.. నిరాశపరిచిన సచిన్​.. ఈ వీడియో చూశారా?

Last Updated : Oct 31, 2022, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details