kohli ganguly issue: గత కొద్ది రోజులుగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మధ్య వివాదం తారస్థాయికి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పలువురు మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడాడు.
"కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వాళ్లిద్దరూ ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటే మంచిది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు తొందరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నా. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలి. మొదట్లో నాకు కావాల్సిన ప్రతీది నాకు లభించింది. కొన్ని సందర్భాల్లో అది జరగదు. దాని అర్థం కెప్టెన్సీ వదిలేయాలని కాదు. ఒకవేళ అదే కారణం వల్ల అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లయితే దానికి నేనేం చెప్పలేను. విరాట్ గొప్ప ఆటగాడు. అతడు టెస్టు క్రికెట్లో మరిన్ని పరుగులు చేస్తుంటే చూడాలని ఉంది"
-కపిల్ దేవ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్.