టీమ్ఇండియా కోచ్ పదవిపై మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే రోజుల్లో భారత జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అందుకోసమే ప్రస్తుతం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ద్రవిడ్‌ను కోచ్‌గా పంపించారని పేర్కొన్నాడు.
టీమ్ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి సమర్థంగా పనిచేసినప్పటికీ.. విరాట్ నేతృత్వంలోని జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయింది. అదే ద్రవిడ్ విషయానికొస్తే.. ఇప్పటికే అండర్-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీంతో ప్రస్తుత తరుణంలో తదుపరి కోచ్‌గా రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపాడు. ఇదిలా ఉండగా, రానున్న టీ20 ప్రపంచకప్‌తో కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది.
"దీని గురించి(తదుపరి కోచ్) మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకోను. శ్రీలంకతో సిరీస్ ముగిశాక.. టీమ్ఇండియా ప్రదర్శనపై ఒక అవగాహన వస్తుంది. కోచ్‌ను మార్చాల్సి వస్తే అది తప్పులేదు. రవిశాస్త్రి కూడా కోచ్‌గా చాలా విజయాలు సాధించాడు. అతన్ని తీసేయాల్సిన అవసరమైతే లేదు. కానీ, మార్పు తప్పదు కదా. కాలానుగుణంగా మార్పులు వస్తాయి."