Kapil Dev Birthday: టీమ్ఇండియా దిగ్గజం కపిల్దేవ్పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. కపిల్ అత్యుత్తమ క్రికెటర్ అనికొనియాడాడు. లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ 63వ పుట్టినరోజు సందర్భంగా భారత జట్టు జోహన్నెస్‌బర్గ్ టెస్టు గెలిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్ఇండియా ప్రస్తుత జట్టులోను కపిల్‌ను ఆదరించేవారు చాలా మంది ఉన్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు గెలిస్తే టీమ్ఇండియా కపిల్‌కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది."
--సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా నెగ్గలేదని గావస్కర్ గుర్తుచేశాడు. 2018 వన్డే సిరీస్ గెలిచినా టెస్టు సిరీస్ 2-1తో ఓడిపోయిందని అన్నాడు. ఈ నేపథ్యంలో సిరీస్ గెలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించాడు.
లిటిల్ మాస్టర్ విషెస్..
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సచిన్ తెందూల్కర్.. కపిల్ దేవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు.
బెస్ట్ ఆల్‌రౌండర్..