టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. క్రికెటర్లలో ఎంత స్టైలిష్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు తన లుక్‌తోనూ ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతడి హెయిర్ స్టైల్, బియర్డ్(గడ్డం) లుక్కు వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కింగ్ కోహ్లీకి తన జుట్టుతో ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. న్యూ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగా ఉంటాడు. హీరోలకు ధీటుగా తన స్టైల్‌తో అందరిని కట్టిపడేస్తుంటాడు. అందుకే కావచ్చు బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ సైతం.. కోహ్లీ అందానికి ఫిదా అయి లైఫ్ పార్ట్నర్గా మారిపోయింది. ఇక క్రికెటర్లలో తన లుక్‌తో ఆకట్టుకునే మరో ప్లేయర్ న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. ఎందుకంటే అతడికి తన గడ్డమే ప్రత్యేకత. ఎప్పుడు బియర్డ్‌తో కనిపించే అతడు తాజాగా కోహ్లీ గడ్డంపై ఓ కామెంట్ చేశాడు. ఏంటంటే?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విలియమ్సన్కు 'మీ గడ్డం బాగుంటుందా..? లేదా విరాట్ కోహ్లీ గడ్డం బాగుంటుందా?' అని ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు సమాధానం చెబుతూ.. 'ఇది కొంచం కఠినమైన ప్రశ్న.. అయినా నా గడ్డమే బాగుంటుంది' అని అతడి గడ్డాన్ని పొగుడుకున్నాడు విలియమ్సన్. అయితే ఇద్దరు సూపర్ హీరోలని, కొంత మంది కింగ్ కోహ్లీ హైలైట్ అని, మరికొందరు విలియమ్సన్ సూపర్ అని క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.