ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా వివాదానికి తెరలేపాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ఒకవేళ భారతీయుడైతే.. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండేవాడని పేర్కొన్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీని గొప్ప క్రికెటర్ అని ఏ ఒక్కరూ ఆమోదించకపోయేవారని తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీని అనుసరించకపోయేవారని అభిప్రాయపడ్డాడు.
"విలియమ్సన్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. కాబట్టి అతడిని కోహ్లీతో సరిపోల్చవచ్చు. విరాట్‌లా కేన్‌కు ఇన్‌స్టాలో 100 మిలియన్ల ఫాలోవర్లు లేరు. కోహ్లీకి వచ్చినట్టు వివిధ ప్రకటనల ఏడాదికి 30-40 మిలియన్ డాలర్ల ఆదాయం కేన్‌కు లేదు. క్రికెట్లో స్థిరంగా రాణించగల సత్తా విలియమ్సన్ సొంతం. ఇండియా కెప్టెన్‌తో పోల్చితే పరుగులు సాధించడంలో కివీస్ సారథే ఓ మెట్టు పైనే ఉంటాడు. అని వాన్ పేర్కొన్నాడు."
-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.