Kane Williamson Injury Update :వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో ముందుకెళ్తున్న న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలిసింది. ఈ ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. ఫీల్డర్ విసిరిన త్రో.. విలియమ్సన్ ఎడమ చేతి వేలికి బలంగా తాకింది. దీంతో మైదానంలోనే కేన్‌మామ నొప్పితో విలవిలలాడాడు.
Kane Williamson Injury Update : న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. కేన్ మామ ఎంత పనైపోయింది! - కేన్ విలియమ్సన్ మిగిత మ్యాచ్‌లకు దూరం
Kane Williamson Injury Update : వన్డే వరల్డ్ కప్ 2023 న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ తగిలింది. గాయం కారణంగా కేన్ మామ మిగితా మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలిసింది.
Published : Oct 14, 2023, 4:39 PM IST
వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించినప్పటికీ నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడిని చికిత్సకు పంపించారు. అయితే స్కానింగ్‌లో అతడి ఎడమచేతి బొటనవేలు విరిగినట్లు తేలింది. దీని నుంకి కోలుకోవడానికి అతడికి కనీసం 6 వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం అందింది. దీంతో అతడు మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందట. అతడి ప్రత్యామ్నయంగా టామ్ బ్లండల్ బరిలోకి దిగనున్నాడని అంటున్నారు.
Kane Williamson ODI World Cup 2023 :కాగా విలియమ్స్‌ను కొంతకాలంగా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. 2019 ప్రపంచ కప్ తర్వాత గాయాల కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్-2023లో మళ్లీ గాయపడ్డాడు. రీసెంట్గా బంగ్లాదేశ్ మ్యాచ్‌తోనే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనం చేసిన మొదటి మ్యాచ్‌లోనే మళ్లీ గాయపడడం అతడికి గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇకపోతే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తన తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 18న అప్గానిస్థాన్‌తో పోటీపడనుంది.