నవంబర్ 18 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్య నాయకత్వంలోని స్క్వాడ్‌ను భారత్ ప్రకటించగా.. తాజాగా కివీస్ కూడా తన జట్టు సభ్యులను వెల్లడించింది. భారత్‌తో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ ఆంగ్ల ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. టీమ్‌ఇండియా ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి రావడం, టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్‌తో సిరీస్‌లు, నాన్‌స్ట్రైకర్ రనౌట్.. కొన్ని విషయాల మీద తన స్పందన తెలిపాడు. నవంబర్ 18న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
నాన్‌స్ట్రైకర్ రనౌట్‌పై..
"ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది మాట్లాడేశారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఆటకు ఇదేమంత ఆకర్షణీయంగా ఉంటుందని అనుకోవడం లేదు. పోటీ పడేటప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగని కాస్త ముందుగా క్రీజ్‌ను వదిలి ప్రయోజనం పొందాలని చూస్తారని భావించడం లేదు. అభిమానులు ఎక్కువగా బ్యాట్, బంతికి మధ్య పోరును చూడటానికే ఇష్టపడతారు"
టీ20 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా గ్లెన్ ఫిలిప్ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉండి స్ప్రింటర్ మాదిరిగా పరిగెత్తేందుకు సిద్ధంగా ఉన్న వీడియో వైరల్‌గా మారింది. దానిపై కేన్ స్పందిస్తూ.. "ఆ సంఘటన గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ ఉంది గ్లెన్ ఫిలిప్. అతడు క్రీజ్‌లో చాలా వేగంగా ఉంటాడు.
అందుకే స్ప్రింటర్‌లా పరుగు కోసం ప్రయత్నిస్తే అదనంగా ప్రయోజనం ఉండొచ్చని అతడు భావించి ఉంటాడు. క్రీజ్‌లో చివరికి ఉండి తన బ్యాట్‌ను గీతకు ఇవతల ఉంచి పరుగు కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి డిఫరెంట్ థియరీలు కొన్ని ఉన్నాయి"