తెలంగాణ

telangana

ETV Bharat / sports

Kane Williamson: విలియమ్సన్​-సారా.. ఓ క్యూట్​ లవ్​స్టోరీ - క్రికెట్ న్యూస్

ఇప్పటివరకు క్రికెటర్ విలియమ్సన్(Kane Williamson) కెప్టెన్సీ గురించి, బ్యాటింగ్ రికార్డుల గురించి మాత్రమే విన్నాం. కానీ అతడికి ఓ క్యూట్​ లవ్​స్టోరీ ఉందని, అది కూడా తొలిచూపులోనే ఏర్పడిందని మీకు తెలుసా? ఇంతకీ కేన్​ను ఆకర్షించిన ఆమె ఎవరు?

Kane Williamson fell in love with a nurse during treatment, about his love life
విలియమ్సన్​-సారా

By

Published : Jun 20, 2021, 10:06 AM IST

కేన్ విలియమ్సన్(Kane Williamson).. ప్రస్తుతం ఉన్న పాపులర్​ క్రికెటర్లలో ఒకడు. ఫార్మాట్​ ఏదైనా సరే తనదైన స్టైల్లో ఆడుతూ, కూల్​గా ప్రత్యర్థిని ఓడిస్తూ పలు రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇవన్నీ పక్కనపెడితే అతడి జీవితంలో ఓ అద్భుతమైన లవ్​స్టోరీ ఉందనే విషయం చాలామందికి తెలియదు!

విలియమ్సన్​ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయటకు రాదు. తన ఇన్​స్టాలో కూడా కేవలం ఒక్క ఫొటో మాత్రమే ఫ్యామిలీది ఉంటుంది. షారా రహీమ్​తో ఐదేళ్లుగా రిలేషన్​లో ఉన్న విలియమన్స్​కు.. కొన్నాళ్ల క్రితం పాప పుట్టింది.

కేన్ విలియమ్సన్

అలా మొదలైంది..!

ఇంగ్లాండ్​లో పుట్టిన సారా.. ఉద్యోగంలో భాగంగా న్యూజిలాండ్​కు మారింది. స్వతహాగా నర్స్ అయిన ఆమెను.. సర్జరీ కోసం ఆస్పత్రికి చేరినప్పుడు విలియమ్సన్ చూశాడు. తొలిచూపులోనే సారాతో ప్రేమలో పడిపోయాడు. ఆ తర్వాత నంబర్లు మార్చుకోవడం సహా డేటింగ్​ కూడా చేశారు. అయితే కొన్ని ఈవెంట్లలో వీరిద్దరూ జంటగా కనిపిస్తూ వచ్చారు. గతేడాది డిసెంబరులో పాప పుట్టిన తర్వాత వీరి బంధం గురించి అందరికీ తెలిసింది. పాప పుట్టిన కొన్నిరోజులకు​ టెస్టుల్లో విలియమ్సన్ డబుల్ సెంచరీ చేశాడు. దానిని తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు!

ఆసక్తికర విషయమేమిటంటే విలియమ్సన్​ సతీమణికి కుమార్తె పుట్టిన నెలలోనే అతడి స్నేహితుడు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా 'వామిక'కు జన్మనిచ్చింది.

విలియమ్సన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details