Kane Williamson Covid: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ కొవిడ్ బారినపడ్డాడు. దీంతో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టుకు అతడు దూరమయ్యాడు. విలియమ్సన్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడి స్థానంలో హమిష్ రూథర్‌ఫర్డ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌కు కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ తొలి టెస్టును కోల్పోయింది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో విలియమ్సన్ లాంటి ప్రధాన బ్యాట్స్‌మన్ కీలకపోరుకు దూరమయ్యాడు. దీంతో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఎలా ఎదుర్కోనుందో ఆసక్తిగా మారింది.