Justin Langer Praises Virat Kohli Kl Rahul : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌పై ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసలు కురిపించాడు. తాను కోచ్‌గా ఉన్న సమయంలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విరాట్, రాహుల్ ఔటయ్యేంత వరకు రిలాక్స్ ఆయ్యేవాడు కాదని అన్నాడు. 'నేను ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్నప్పుడు టీమ్ఇండియాతో మ్యాచ్‌లు జరుగుతుంటే విరాట్, రాహుల్ ఔటయ్యే దాకా రిలాక్స్ అయ్యేవాడిని కాదు' అని లాంగర్ రీసెంట్గా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే 2024 ఐపీఎల్కుగాను తమ జట్టు హెడ్ కోచ్‌గా లాంగర్‌ను లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఇటీవల నియమించుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఫ్రాంచైజీతో లాంగర్ మాట్లాడాడు. ఐపీఎల్ అనేది తనకు ఒలింపిక్స్‌తో సమానం అని అభిప్రాయపడ్డాడు. 'నా ఫ్రెండ్స్ రికీ పాంటింగ్, టామ్ మూడీ చాలా కాలం నుంచి ఐపీఎల్లో సేవలందిస్తున్నారు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ గురించి రికీ నాకు ఎప్పుడూ చెబుతుంటాడు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ చాలా పెద్దది. ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒలింపిక్స్ లాంటింది. అటువంటి పెద్ద టోర్నీలో నేనూ భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని లాంగర్ అన్నాడు.
జస్టిన్ లాంగర్ 2018-2022 మధ్య టెన్యూర్‌లో ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. లాంగర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఆసీస్ 2021లో తొలి టీ20 వరల్డ్‌కప్ అందుకుంది. ఆ తర్వాత లాంగర్ బిగ్‌బాష్ టీ20 లీగ్‌లోనూ ఆయా జట్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇక కొన్ని రోజుల కిందట లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఆండీ ఫ్లవర్ స్థానంలో లాంగర్‌ను కోచ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించింది.