ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఆర్చర్.. టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌లో ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. మోచేతి గాయానికి మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్, యాషెస్ టెస్టు సిరీస్‌పై దృష్టి సారించేందుకే ఆర్చర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
IND VS ENG: భారత్‌తో తొలి టెస్టుకు ఆర్చర్ కష్టమే! - Jofra Archer first Test against India
ఆగస్టులో భారత జట్టుతో జరిగే తొలి టెస్టులో ఇంగ్లీష్ క్రికెటర్ ఆర్చర్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల అతడికి శస్త్రచికిత్స జరిగింది.
ఆర్చర్
ఈ ఏడాది మార్చిలో భారత్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఆర్చర్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఆడలేకపోయాడు. ప్రస్తుతం అతడికి సర్జరీ జరగడం వల్ల త్వరలో కోలుకునే అవకాశముంది.
ఇది చదవండి:ఆర్చర్‌కు మళ్లీ సర్జరీ.. ఆటకు 4 వారాలు దూరం