తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ షాట్​ వల్ల జో రూట్ ఔట్​ - తొలి సారి మాత్రం అలా! - ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ స్కోర్

Joe Root World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఇంగ్లాండ్​ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ ఓ నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఇంగ్లాండ్​ జట్టు ఒక్కసారిగా షాకైంది. ఇంతకీ ఏం జరిగిందంటే

Joe Root World Cup 2023
Joe Root World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 8:00 PM IST

Joe Root World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఇంగ్లాండ్​ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి రూట్‌ పెవిలియన్​ బాట పట్టాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపులు మెరిపిస్తాడని అనుకుంటే.. ఓ నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఇంగ్లాండ్​ జట్టు ఒక్కసారిగా షాకైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..
NED Vs ENG World Cup 2023 :డేవిడ్​ మలన్ ఔటయ్యాక క్రీజులోకి దిగిన జో రూట్.. తొలుత నిలకడగానే ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌లోని 20 ఓవర్​లో లోగాన్ వాన్ బీక్‌ వేసిన రెండో బంతికి ర్యాంప్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే సరైన పొజిషన్‌లో లేకపోవడం వల్ల బంతి బ్యాట్‌కు మిస్​ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రూట్​ అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే అస్సలు ఆ బంతికి రూట్‌ ఆ షాట్‌ ఆడే అవసరమే లేదు. కానీ ఆ షాట్‌ వల్ల ఇప్పుడు రూట్​ ఔటయ్యాడు. అయితే అంతకుముందు ఓవర్‌లోనే ఇదే తరహా షాట్​ ఆడి బాల్​ను బౌండరీ దాటించాడు.

NED Vs ENG Score :ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. ఇన్ని రోజులు పేలవ ప్రదర్శన చూపించిన ఇంగ్లాండ్ జట్టు.. ఈ మ్యాచ్​లో చెలరేగిపోయారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్​ జట్టు తమదైన శైలిలో ఆడి నెదర్లాండ్స్​ జట్టు ముందు భారీ టార్గెట్​ ఉంచింది. ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ (87), బెన్‌ స్టోక్స్ (84) సెంచరీలతో సూపర్​ ఇన్నింగ్స్ ఇవ్వగా.. మిగతా ప్లేయర్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. అలా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేశారు. ఇక మలన్‌, స్టోక్స్‌తో పాటు క్రిస్‌ వోక్స్‌ (45) మెరుపులతో ఇంగ్లాండ్​ భారీ స్కోరు చేయగలిగింది.

వరల్డ్ కప్ 2023 సెమీస్​ - ఈ రెండు గెలిస్తే ఆ నాలుగు ఔట్‌

క్రికెట్​కు స్టార్​ బౌలర్​ గుడ్​బై వరల్డ్​కప్​ తర్వాత రిటైర్మెంట్​

ABOUT THE AUTHOR

...view details