తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Eng: 'ఈ ఓటమి చికాకు తెప్పించింది' - జో రూట్ వ్యాఖ్యలు

టీమ్​ఇండియాతో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి పాలవ్వడం చికాకు తెప్పించిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(Joe Root) అన్నాడు. తమకు గెలిచే అవకాశమున్నప్పటికీ ఓటమిపాలయ్యామని వెల్లడించాడు.

joe root
జో రూట్

By

Published : Sep 7, 2021, 7:49 AM IST

టీమ్‌ఇండియాతో ఆడిన నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test) ఓటమిపాలవ్వడం చికాకు తెప్పించిందని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అన్నాడు. ఈ వైఫల్యం నుంచి తమ జట్టంతా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశమున్నా ఓటమిపాలయ్యామని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శుభారంభం చేసినా టీమ్‌ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించారని అన్నాడు. వాళ్లు రివర్స్‌స్వింగ్‌తో తమ ఆట కట్టించారని ఇంగ్లాండ్‌ సారథి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ రూట్‌(joe root test centuries) ఈ వ్యాఖ్యలు చేశాడు.

'టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు, రెండో సెషన్‌లో అతడు వరుస ఓవర్లలో పోప్‌, బెయిర్‌స్టోలను పెవిలియన్‌ పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడు ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాగే ఈ మ్యాచ్‌లో మేం ఎలాంటి తప్పులు చేశామో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో పాటు ఇతర అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది' అని రూట్‌ పేర్కొన్నాడు.

స్లిప్‌లో పలు క్యాచ్‌లు జారవిడ్చడంపై స్పందిస్తూ.. దీనిపై మరింత దృష్టిసారించాలని చెప్పాడు రూట్​. చివరగా తమ బౌలర్లు గాయాలబారిన పడటం ఇబ్బందిగా మారిందని వివరించాడు. అయినా తాము రాణిస్తామని, వచ్చేవారం జరిగే చివరి టెస్టులో మరింత బాగా ఆడతామని చెప్పాడు.

ఇదీ చదవండి:IND Vs ENG: నాలుగో టెస్టు హైలైట్స్​!

ABOUT THE AUTHOR

...view details