తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా అనిపిస్తే మెగా వేలంలో పాల్గొనడం కష్టమే' - IPL Auction

Joe Root IPL 2022: ఐపీఎల్​ మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మెగా వేలంలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై మాట్లాడాడు ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్. టెస్టు క్రికెట్​పై ప్రభావం చూపదని అనిపిస్తేనే ఐపీఎల్​లో పాల్గొంటానని అన్నాడు.

root
రూట్

By

Published : Jan 14, 2022, 5:46 AM IST

Joe Root IPL 2022: త్వరలో జరగబోయే ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనాలా.. వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని, దాని గురించి ఆలోచిస్తున్నానని ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి జోరూట్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆడితే.. అది తన టెస్టు క్రికెట్‌పై ప్రభావం చూపదని అనిపిస్తేనే మెగా వేలంలో పాల్గొంటానని స్పష్టం చేశాడు.

'ఈ ఏడాది ఐపీఎల్ మెగా ఈవెంట్‌కు సంబంధించి వేలం నిర్వహించే తేది సమీపిస్తోంది. అయితే నేను ఆలోచించాల్సింది చాలా ఉంది. అది నా టెస్టు క్రికెట్‌పై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది ఆలోచించాలి. ఒకవేళ నాకు ఇబ్బందిగా అనిపించకపోతే కచ్చితంగా వేలంలో పాల్గొంటా. అలాకాకుండా నా కెరీర్‌కు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెనకడుగు వేస్తా. ఇంగ్లాండ్ తరఫున ఆడటమే నాకు అత్యంత ముఖ్యమైన విషయం' అని రూట్ పేర్కొన్నట్లు ఓ క్రీడాఛానల్‌ తెలిపింది. కాగా, ఈ ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ చాలా రోజుల నుంచే ఐపీఎల్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details