తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్ రికార్డుకు అడుగు దూరంలో ఇంగ్లాండ్ కెప్టెన్ - జో రూట్ రికార్డు

Joe Root Records: ఇంగ్లాండ్ సారథి జో రూట్ టెస్టు క్రికెట్​లో సచిన్, సునీల్ గావస్కర్​ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. యాషెస్​ సిరీస్​ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడుతున్న రూట్.. ఇప్పటికే ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

joe root
జో రూట్

By

Published : Dec 10, 2021, 8:23 PM IST

Joe Root Records: ఆస్ట్రేలియాతో యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్​లో డకౌట్ అయిన రూట్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసేసరికి 86 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. దీంతో ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1541 రన్స్​ చేసిన రూట్.. టెస్టు క్రికెట్​లో ఓ క్యాలెండర్​ ఇయర్​లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్​ను అధిగమించాడు.

అయితే.. శనివారం మ్యాచ్​లో కూడా రూట్ తన జోరును కొనసాగిస్తే.. మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయం. మరో మూడు పరుగులు చేస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 2005లో చేసిన 1544 పరుగుల రికార్డును సమం చేస్తాడు. దీంతో అన్ని క్యాలెండర్ ఇయర్​లలో కలిపి తక్కువ ఇన్నింగ్స్​లలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంటాడు.

పాక్​ ఆటగాడే నంబర్ 1..

2006లో 11 టెస్టుల్లో 99.33 సగటుతో 1788 పరుగులు చేసిన పాకిస్థాన్​ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్ 1562 పరుగులు(2010), సునీల్ గావస్కర్ 1555 పరుగులతో(1979) ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నారు.

1976లో 11 టెస్టుల్లో 1710 పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాటర్ వివ్ రిచర్డ్స్​ రెండో స్థానంలో ఉండగా.. 2008లో 15 మ్యాచ్​ల్లో 1656 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాడు గ్రీమ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్(2012లో 1595 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఈ ఏడాది రూట్ ఆరు సెంచరీలు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు, రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి:

టెస్టుల్లో సచిన్ చెక్కుచెదరని రికార్డు.. నేటికి 16 ఏళ్లు!

Ashes Proposal: యాషెస్ టెస్టులో లవ్ ప్రపోజల్.. తర్వాత ఏమైందంటే?

Ashes 2021: తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న ఆసీస్.. ఇంగ్లాండ్ 107/2

ABOUT THE AUTHOR

...view details