Jhulan Goswami: తన 22 ఏళ్ల ఘనమైన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 40 వికెట్లతో ఆస్ట్రేలియాకు చెందిన లినెట్ ఫుల్స్టోన్ను (39 వికెట్లు) వెనక్కునెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది.
శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తీసిన ఒకే ఒక వికెట్‌తో ఈ ఘనత దక్కించుకుంది ఝులన్ గోస్వామీ. 39 ఏళ్ల గోస్వామి.. 2005 నుంచి ఐదు ప్రపంచకప్‌లు ఆడింది.
సెహ్వాగ్ ప్రశంస..
ఇక ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసి ప్రపంచకప్ టైటిల్ పోటీలో నిలిచింది టీమ్ఇండియా. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత శతకాలతో విండీస్‌పై 155 పరుగుల తేడాతో గెలుపొందింది. వారిని ప్రశంసిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. "పురుషుల క్రికెట్లో జెర్సీ నెం.7 (ఎంఎస్ ధోనీ), జెర్సీ నెం.18 (విరాట్ కోహ్లీ).. బౌలర్లకు చెమటలు పట్టించారు. ఇప్పడు స్మృతి, కౌర్ అద్భుతం చేశారు" అని సెహ్వాగ్ ప్రశంసించాడు.
ఇదీ చూడండి:అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్‌పై భారీ విజయం