ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో (ICC Hall of Fame 2021) శ్రీలంక దిగ్గజం మహేలా జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొల్లాక్, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జానెటి బ్రిటిన్‌కు చోటు దక్కింది. వీరితో కలిపి ఇప్పటివరకు 106 మంది క్రికెటర్లకు ఈ గౌరవం దక్కింది. క్రికెట్లో మరపురాని ఘనతలు అందుకున్న వారిని 2009 నుంచి ఈ విధంగా గౌరవిస్తోంది ఐసీసీ.
బ్రిటిన్..
ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో 19 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించింది బ్రిటిన్ (Janette Brittin). 1979 నుంచి 1998 వరకు 27 టెస్టులు, 63 వన్డేలు ఆడిన బ్రిటిన్.. మహిళల క్రికెట్లోనే గొప్ప బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు (49.61 సగటుతో 1935), శతకాలు (5) సాధించింది.
వన్డేల్లోనూ బ్రిటిన్ ఆధిపత్యం చాటింది. 42.42 సగటుతో 2121 పరుగులు చేసింది. 2017లో తుదిశ్వాస విడిచింది. ఇంగ్లాండ్ తరఫున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కించుకున్న 31 క్రికెటర్ బ్రిటిన్.
మహేలా..
శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌గా రిటైరైన వ్యక్తి మహేలా జయవర్ధనే (Mahela Jayawardene News). 149 టెస్టులు, 448 వన్డేలు, 55 అంతర్జాతీయ టీ20ల్లో 652 మ్యాచ్‌లు ఆడాడు (Mahela Jayawardene Stats) మహేలా. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లలో 12 మ్యాచ్‌ల తేడాతో సచిన్ తెందూల్కర్ మాత్రమే అతడి కన్నా ముందున్నాడు.
వన్డేల్లో 33.37 సగటుతో 12,650 పరుగులు, 19 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 49.84 సగటుతో 11,814 పరుగులు, 34 శతకాలు (Mahela Jayawardene Centuries) బాదాడు జయవర్ధనే.