తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: ఇంటర్వ్యూలో బుమ్రాను సంజన ఏం అడిగిందంటే? - బుమ్రాను ఇంటర్వ్యూ చేసిన సంజన

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తన సతీమణి సంజనతో కలిసి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న రోజు తన జీవితంలో మధురమైనదిగా వర్ణించాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ 2-1తో సిరీస్‌ గెలవడం మర్చిపోలేదని వెల్లడించాడు.

bumrah, sanjana
బుమ్రా, సంజన

By

Published : Jun 18, 2021, 8:02 AM IST

Updated : Jun 18, 2021, 9:14 AM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final)కు ముందు సంజనా గణేశన్‌(Sanjana Ganesan) తన భర్త జస్ప్రీత్‌ బుమ్రా(Bumrah)ను ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఐసీసీ డిజిటల్‌ ఇన్‌సైడర్‌ వ్యాఖ్యాతగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్‌స్టాలోని పాత చిత్రాల గురించి ప్రశ్నించింది. అప్పటి సంఘటనల గురించి అడిగింది. ఈ వీడియోను ఐసీసీ ట్విట్టర్​లో షేర్ చేసింది. "సోదరితో కలిసి ఆడటం.. స్కూల్‌ క్రికెట్లో మెరవడం.. తన జీవితంలోని అత్యుత్తమైన రోజు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు జస్ప్రీత్‌ బుమ్రా ఇన్‌స్టా జ్ఞాపకాల గురించి సంజనా గణేశన్‌ అడిగింది" అని వ్యాఖ్య పెట్టింది.

"నా జీవితంలోనే అత్యుత్తమైన రోజది. అది (పెళ్లి) ఈ మధ్యే జరిగింది. ఆ జ్ఞాపకాల గురించి నీక్కూడా తెలుసు. అది నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు. ఇవన్నీ చిరకాలం గుర్తుంటాయి. ఇంకా మరెన్నో రానున్నాయి" అని తన పెళ్లి చిత్రం చూసిన బుమ్రా చెప్పాడు.

ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా 2-1తో సిరీస్‌ గెలిచిన విషయాలను బుమ్రా పంచుకున్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని పట్టుకున్న చిత్రం చూపించినప్పుడు ఆ విశేషాలు చెప్పాడు. "ఈ చిత్రం నాలుగో టెస్టు తర్వాత తీశారు. నేనా మ్యాచ్‌ ఆడలేదు. కుర్రాళ్లంతా ముందుకొచ్చారు. అదో మర్చిపోలేని విజయం. సంతోషకరమైన రోజులవి. మేం వరుసగా రెండోసారి అక్కడ సిరీస్‌ గెలిచాం. కాబట్టి అదీ మర్చిపోలేని రోజే"అని అన్నాడు. అలాగే చిన్నప్పుడు సోదరితో క్రికెట్‌ ఆడటం, పాఠశాలలో క్రికెట్‌ ఆడటం గురించి వివరించాడు.

ఇవీ చూడండి:WTC FINAL: తొలి ఛాంపియన్​షిప్​ వరించేదెవరిని?

Last Updated : Jun 18, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details