విచిత్రమైన బౌలింగ్ శైలి కలిగిన జస్ప్రీత్ బుమ్రా(Bumrah), లసిత్ మలింగ(Malinga) లాంటి పేసర్లను ఎదుర్కోవడం కష్టమని టీమ్ఇండియా(Team India) మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. వారి బౌలింగ్‌లో బంతులు ఎలా వస్తాయో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కావని చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్లో ఎన్నో మార్పులు జరిగాయని తెలిపాడు. ఆఫ్ కట్టర్లు, ఆఫ్ కట్టర్ బౌన్సర్, నకుల్ బాల్, వైవిధ్యమైన యార్కర్లు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొన్నాడు.
"బుమ్రా పూర్తిగా భిన్నమైన బౌలర్. ఎందుకంటే అతడి బౌలింగ్ శైలి సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అతడు లసిత్ మలింగ తరహా బౌలర్. బుమ్రా ఒకవైపు నుంచే బౌలింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మలింగకు వ్యతిరేకంగా ఉంటాడు. అలాంటి బౌలర్లను ఆడటం సులువు కాదు. వాళ్ల బంతులు నేరుగా పిచ్ అవుతాయా? స్వింగ్ చేస్తారా? అర్థంకాక బ్యాట్స్‌మన్ తికమక పడతారు. అందుకే వారు విజయవంతం అయ్యారు. బుమ్రా భిన్నమైన శైలే అతడికెంతో ఉపయోగపడుతోంది. అందులో చాలా వైవిధ్యం ఉంటుంది"