T20 World Cup 2022 India Squad : అస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఈ నెల 16న ప్రకటించనుంది. అయితే బుమ్రా, హర్షల్ పటేల్‌ను కూడా వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు బౌలర్లు గాయాల నుంచి కోలుకున్న కారణంగా జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
బుమ్రా నెట్లో రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడని.. అతడిని ఓ మెడికల్ బృందం పర్యవేక్షిస్తోందని సమాచారం. అయితే బుమ్రా ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకా ఫైనల్ ఫిట్నెస్ టెస్ట్ జరగలేదు. కానీ అతడు క్లియర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా హర్షల్ పటేల్ కూడా బాగానే ఉన్నాడని.. సెలెక్షన్స్‌కు అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం. అయితే ఇదంతా ఆఖరి ఫిట్నెస్ పరీక్షల మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.