తెలంగాణ

telangana

ETV Bharat / sports

ట్రోలర్స్​కు బుమ్రా స్ట్రాంగ్​ కౌంటర్‌.. అలా చేస్తే మీ గోల్స్​ను చేరుకోలేరంటూ.. - బుమ్రా ట్రోల్స్​

వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్​కు దూరమైన టీమ్​ఇండియా స్టార్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా విపరీతంగా ట్రోలింగ్​కు గురవతున్నాడు. వాటిన్నంటికి బుమ్రా సోషల్​ మీడియా వేదికగా స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడు. ఏమన్నాడంటే?

jasprit-bumrah-cryptic-post-for-critics-after-being-ruled-out-of-t20-world-cup
jasprit-bumrah-cryptic-post-for-critics-after-being-ruled-out-of-t20-world-cup

By

Published : Oct 6, 2022, 3:01 PM IST

Updated : Oct 6, 2022, 3:16 PM IST

వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్​ వస్తున్నాయి. జాతీయ జట్టు తరఫున పట్టుమని నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోతున్న బుమ్రా.. భారత టీ20 లీగ్‌లో మాత్రం అన్ని మ్యాచ్‌లూ ఆడేందుకు మాత్రం ఫిట్‌నెస్‌, గాయాలు అడ్డు రావడం లేదని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తూర్పారబట్టారు.

వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్‌ల బరిలోనూ దిగలేకపోయిన బుమ్రా ఆసీస్‌తో మాత్రమే టీ20 సిరీస్‌ ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ క్రికెట్‌కు అందుబాటులో ఉండే బుమ్రా టీమ్‌ఇండియా కోసం మాత్రం గాయాలను సాకుగా చూపి తప్పించుకొంటున్నాడని విమర్శలు వచ్చాయి. అయితే వాటికి కౌంటర్‌గా బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

"మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే నువ్వు నీ గమ్యస్థానానికి ఎప్పటికీ చేరుకోలేవు" అని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. ఇది యూకే మాజీ ప్రధాని విన్‌స్టల్ చర్చిల్ ప్రసిద్ధిగాంచిన కొటేషన్. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ నుంచి బుమ్రా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బుమ్రా కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. పొట్టి ప్రపంచకప్‌ జట్టులో భాగం కాలేకపోవడం భావోద్వేగానికి గురి చేసిందని, అయితే గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా గైర్హాజరీతో వరల్డ్‌ కప్‌ ప్రధాన జట్టులోకి ఆటగాడి పేరును బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.

ఇవీ చదవండి:రీఎంట్రీ ఇచ్చిన వివాదాస్పద క్రికెటర్​.. ఆరు పరుగులకే పెవిలియన్​ చేరి..

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్​ భార్య.. ఫ్యాన్స్​​కు థ్యాంక్స్​ చెబుతూ లెటర్​!

Last Updated : Oct 6, 2022, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details