తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎలా నవ్వగలుగుతున్నావు బుమ్రా.. బాధగా లేదా'? - బుమ్రా సంజనా గణేషన్

సామాజిక మాధ్యమాల వేదికగా టీమ్ఇండియా పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాను అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇన్​స్టాతో పాటు ట్విట్టర్​లో తన భార్య సంజనా ఫొటోను పెట్టిన బుమ్రాను.. 'ఇందుకు మీకు బాధగా లేదా'? అంటూ ప్రశ్నిస్తున్నారు.

jasprith bumrah, sanjana ganesan
జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేషన్

By

Published : Jul 2, 2021, 8:57 AM IST

టీమ్ఇండియా యార్కర్​ స్పెషలిస్ట్​ జస్ప్రీత్​ బుమ్రాను అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. న్యూజిలాండ్​తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అత్యంత చెత్త ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం.

ఇంగ్లాండ్​తో సిరీస్​కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లకు దాదాపు 20 రోజుల ఖాళీ సమయం ఉంది. అందులో భాగంగానే తన భార్య సంజనా గణేషన్​తో కలిసి సరదాగా గడుపుతున్నాడు బుమ్రా. ఈ క్రమంలోనే ఇద్దరూ నవ్వుతున్న ఓ ఫొటోను తన ఇన్​స్టాతో పాటు ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశాడు జస్ప్రీత్. దీనిపై స్పందించిన ఫ్యాన్స్​.. 'అలా ఎలా నవ్వుతున్నావు' అంటూ ప్రశ్నించారు. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక్క వికెట్ కూడా తీయనందుకు బాధపడాలంటూ విమర్శిస్తున్నారు.

"డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత కూడా సంతోషంగా ఎలా ఉన్నావు? ఐసీసీ సెమీ ఫైనల్స్​, ఫైనల్స్​లో టీమ్ఇండియా ఆటగాళ్లు పదేపదే విఫలమవుతున్నారు. ఐపీఎల్​లో మాత్రం 100 శాతం ప్రదర్శన చేస్తున్నారు. అదే ఇండియాకు ఆడేటప్పుడు అందులో 30 శాతం ప్రయత్నం కూడా చేయరు. ఇందుకు మీకు బాధగా లేదా?" అని ఓ అభిమాని ట్విట్టర్​ వేదికగా బుమ్రాను ప్రశ్నించాడు.

సౌథాంప్టన్​ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పేసర్లకు సహకరిస్తున్న పిచ్​పై బుమ్రా ఒక్క వికెట్​ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ప్రస్తుతం యూకే టూర్​లో ఉన్న టీమ్ఇండియా ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో టెస్ట్ సిరీస్​ ఆడనుంది.

ఇదీ చదవండి:అందమైన బొమ్మ.. ఈ టీమ్ఇండియా ముద్దుగుమ్మ

ABOUT THE AUTHOR

...view details