తెలంగాణ

telangana

ETV Bharat / sports

Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా? - బుమ్రా కమ్​బ్యాక్

Jasprit Bumrah Baby : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ సోమవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Jasprit Bumrah Baby
Jasprit Bumrah Baby

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 11:06 AM IST

Updated : Sep 4, 2023, 12:22 PM IST

Jasprit Bumrah Baby : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ సోమవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. " చిన్న కుటుంబం కాస్త పెరిగింది. ఈరోజు ఉదయాన్నే మా కుమారుడు 'అంగద్ జస్​ప్రీత్ బుమ్రా' (Angad Jasprit Bumrah) జన్మించాడు. మా సంతోషానికి అవధుల్లేవ్. మా లిటిల్​ బాయ్​కు ఈ ప్రపంచంలోకి స్వాగతం" అని రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా బుమ్రాకు పలువురు క్రీడా ప్రముఖులు, అతడి ఫ్యాన్స్ సోషల్​ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీవీ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయిన సంజనా గణేశన్​తో.. బుమ్రా కొంతకాలం ప్రేమాయణం నడిపించాడు. తర్వాత 2021 మార్చ్​ 15న గోవాలో కొవిడ్ ఆంక్షల మధ్య అతి తక్కువ మంది సమక్షంలో బుమ్రా.. ఆమెను పెళ్లాడాడు.

Bumrah Asia Cup 2023 :ఇక తన భార్య డెలివరీ కారణంగా.. ఆసియా కప్​ కోసం శ్రీలంకలో ఉన్న బుమ్రా ఆదివారం రాత్రి భారత్​కు తిరిగి వచ్చేశాడు. సోమవారం నేపాల్​తో జరిగే మ్యాచ్​కు బుమ్రా అందుబాటులో లేడు. ఈ మ్యాచ్​లో బుమ్రా స్థానాన్ని మహ్మద్ షమీ భర్తీ చేయనున్నాడు. అయితే సూపర్ 4 మ్యాచ్​లకు బుమ్రా మళ్లీ జట్టుతో కలుస్తాడని టీమ్ఇండియా మేనేజ్​మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఆసియా కప్​ 2023 గ్రూప్​-ఏలో భారత్ 1 పాయింట్​తో రెండో స్థానంలో ఉంది. ఇక 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్.. సూపర్ 4కు అర్హత సాధించింది. ఇక సోమవారం భారత్, నేపాల్​తో తలపడనుంది. సూపర్ 4 కు చేరేందుకు ఈ మ్యాచ్.. ఇరుజట్లకు కీలకం. అయితే వర్షం కారణంగా ఆట రద్దైతే.. ఇరు జట్లకు చెరోపాయింట్ లభిస్తుంది. దీంతో రెండు పాయింట్లతో భారత్ నేరుగా సూపర్ 4 కు అర్హత సాధిస్తుంది.

ఇటీవలె రీ ఎంట్రీ..
Bumrah Return :గతేడాది గాయపడిన బుమ్రా.. దాదాపు పది నెలలపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. రీసెంట్​గా పూర్తి ఫిట్​నెస్ సాధించి.. ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఇక బుమ్రా నాయకత్వంలోని టీమ్ఇండియా.. మూడు మ్యాచ్​ల టీ20ల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది.

బుమ్రా బౌలింగ్​ సీక్రెట్​పై ఐసీసీ వీడియో

Bumrah Ireland T20 : టీ20ల్లో బుమ్రా ఎంట్రీ.. అతని ముందున్న ఆ రెండు ఛాలెంజస్​ ఇవే..

Last Updated : Sep 4, 2023, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details