Jason Roy ruled out of IPL: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆటగాడు జేసన్ రాయ్.. టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించాడు. బయోబబుల్ ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీకి తెలిపాడు. అతడికి వేలంలో రూ.2కోట్లకు అమ్ముడుపోయాడు.
గతంలోనూ..
ఐపీఎల్ 13వ సీజన్‌లో జేసన్ రాయ్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలోనూ వ్యక్తిగత కారణాలతో అతడు టోర్నీలో పాల్గొనలేదు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన రాయ్... మొదటి ఫేజ్‌కు దూరమైన, రెండో దశలో మొత్తం 5 మ్యాచులు ఆడి 150 పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 329 పరుగులు సాధించాడు.