Jason Roy ban: ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఇంగ్లాండ్ ఆడే తదుపరి రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకు జేసన్ రాయ్ అందుబాటులో ఉండడని ఈసీబీ స్పష్టం చేసింది. దీంతో పాటు రూ.రెండున్నర లక్షలు(2500 పౌండ్లు) జరిమానా విధించింది. మార్చి 31లోపు జరిమానా కట్టాలని ఆదేశించింది. క్రికెట్ ప్రయోజనాలకు విరుద్ధంగా తాను నడుచుకున్నానని జేసన్ రాయ్ ఒప్పుకున్నాడని అందుకే నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇందుకు నిర్దిష్ట కారణాలను తెలియజేయలేదు.
"క్రికెట్ క్రమశిక్షణ కమిషన్ జేసన్ రాయ్‌పై చర్యలు తీసుకుంది. అతడిపై ఆంక్షలు విధించింది. క్రికెట్ ప్రయోజనాలతో పాటు, తనకు, బోర్డుకు అపఖ్యాతి కలిగేలా వ్యవహరించానని జేసన్ ఒప్పుకున్నాడు. ఈసీబీ నిబంధన 3.3ని ఉల్లంఘించాడు" అని బోర్డు వివరించింది.