క్రికెట్లో జాతివివక్ష వ్యతిరేక ఉద్యమానికి కొత్త పంథా అవసరమని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(Jason Holder) అన్నాడు. మ్యాచ్‌లకు ముందు మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలపడం ఒక్కటే సరిపోదని వ్యాఖ్యానించాడు.
"దీని గురించి చర్చించాను. మ్యాచ్‌కు ముందు చేసే ఈ పని నీరుగారిపోయిన చర్యగా కొంతమంది భావిస్తున్నారని నేను అనుకుంటున్నా. మళ్లీ ఈ ఉద్యమాన్ని రగిలించడానికి కొత్త పంథాను చూడాలనుకుంటున్నా. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' కోసం మోకాళ్లపై నిలబడటం సంప్రదాయమనో, నిబంధన అనో అని ప్రజలు అనుకోవద్దు. దీనికో అర్థం ఉండాలి. ఉద్యమాన్ని తిరిగి ప్రేరేపించడం కోసం మరింత ఆలోచనా ప్రక్రియ అవసరం."