Jarvo 69 Ind Vs Aus ODI World Cup 2023 :హలో క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు పెద్ద అభిమాని అయిన 'జార్వో 69' గుర్తున్నాడా మీకు? అదేనండీ 2021లో ఇంగ్లాండ్-టీమ్ఇండియా టెస్టు సిరీస్‌లో పదే పదే భారత జెర్సీ ధరించి మైదానంలోకి దూసుకొచ్చి సంచలనంగా మారాడు. క్రికెట్ మ్యాచ్‌ల భద్రతలో డొల్లతనం అతడి వల్ల బయటపడిదంటూ కథనాలు కూడా వచ్చాయి. దీంతో మ్యాచ్‌కు అతడు పదే పదే అంతరాయం కలిగించి అరెస్ట్ కూడా అయ్యాడు.
అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తుచేస్తున్నానని అనుకుంటున్నారా? ఎందుకంటే అతడు మళ్లీ వచ్చేశాడు. ఇంగ్లాండ్ ప్రముఖ యూట్యూబర్ జార్వో అలియాస్ డేనియెల్ జార్విస్... మరోసారి మైదానంలో ప్రత్యక్షమై కాసేపు సతాయించాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా టీమ్ ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోందిగా. ఈ మ్యాచ్‌లో అతడు టీమ్ ఇండియా జెర్సీ ధరించి మైదానంలోకి దూసుకొచ్చాడు. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే అతడు మైదానంలోకి పరిగెత్తుకుని వచ్చి.. కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు.
అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని బయటికి పంపించే ప్రయత్నం చేసినా అతడు వినలేదు. ఇక అదే సమయంలో టీమ్ ఇంఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రంగంలోకి దిగి.. అతడికి సర్ది చెప్పాడు. అతడి దగ్గరికి వెళ్లి బయటకు పంపే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు జార్వో మామా మళ్లీ వచ్చేశావా? అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.