తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీసేన ఆట చూసి బాత్రూం​లో దాక్కున్న స్టార్ క్రికెటర్ - డబ్ల్యూటీసీ ఫైనల్​పై జేమీసన్​ స్పందన

డబ్ల్యూటీసీ ఫైనల్ చివరి రోజున తనకు జరిగిన వింత అనుభవం గురించి కివీస్ ఆల్​రౌండర్​ జేమీసన్​ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్​లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెమ్మదిగా ఆడడం వల్ల తాను కాస్త ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నాడు. దానిని అధిగమించడానికి బాత్రూంలో దాక్కున్నానని వెల్లడించాడు.

kyle jamieson, wtc final
కైల్ జేమీసన్, డబ్ల్యూటీసీ ఫైనల్

By

Published : Jun 29, 2021, 5:33 PM IST

ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్​ చివరిరోజు తనకు జరిగిన వింత అనుభవం గురించి న్యూజిలాండ్ ఆల్​రౌండర్​ కైల్ జేమీసన్​ తెలిపాడు. కివీస్​ రెండో ఇన్నింగ్స్​ సందర్భంగా తాను కాస్త ఆందోళన, నిరాశకు గురైనట్లు పేర్కొన్నాడు. దానిని అధిగమించడానికి బాత్రూం​లో దాక్కున్నట్లు వెల్లడించాడు.

కీలకమైన ఈ మ్యాచ్​లో జేమీసన్​ ఆల్​రౌండ్ ప్రదర్శన చేశాడు. బౌలింగ్​లో ఏడు వికెట్లు తీయడమే కాకుండా.. రెండు ఇన్నింగ్స్​లోనూ టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్​ను దక్కించుకున్నాడు. బ్యాట్​తోనూ మెరిసిన జేమీసన్​.. తొలి ఇన్నింగ్స్​లో కీలకమైన 21 పరుగులు సాధించాడు.

"కివీస్​ రెండో ఇన్నింగ్స్​ను డ్రెస్సింగ్ రూమ్ లోపల కూర్చొని టీవీలో చూస్తున్నాం. ఛేదన కొంత ఆలస్యంగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలియలేదు. వికెట్ పడినప్పుడు ఎలా చేస్తారో భారత అభిమానులు అలాగే లేచి టీమ్ఇండియాను ఉత్సాహపరుస్తున్నారు. కానీ, ఆ బంతి డాట్​ కావడమో, లేకుంటే సింగిల్ రావడమో జరుగుతుంది. మ్యాచ్​ సాగుతుంటే కఠినంగా అనిపించింది. టెన్షన్​ను తట్టుకోలేక బాత్రూంలో దాక్కున్నాను."

-కైల్ జేమీసన్, కివీస్ ఆల్​రౌండర్.

"చివరకు విలియమ్సన్​-టేలర్​ జంట ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇద్దరు అనుభవం గల బ్యాట్స్​మెన్​ సందర్భానుసారంగా ఆడారు" అని జేమీసన్ పేర్కొన్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్​ అనంతరం కౌంటీ మ్యాచ్​లో ప్రత్యక్షమయ్యాడు జేమీసన్​. దీంతో విజయానికి సంబంధించి తాను సరిగా ఎంజాయ్​ చేయలేకపోయానని తెలిపాడు. టీ20 మ్యాచ్​కు సంబంధించి సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ​

ఇదీ చదవండి:టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ ఇదే.. ఆ హక్కులు భారత్​వే!

ABOUT THE AUTHOR

...view details