తెలంగాణ

telangana

ETV Bharat / sports

Jadeja Test Retirement: టెస్టు రిటైర్మెంట్​పై జడేజా క్లారిటీ

Jadeja Test Retirement: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు జట్టుకు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించాడు జడ్డూ. ఇప్పుడప్పుడే టెస్టు జట్టును వీడనని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశాడు.

jadeja
జడేజా

By

Published : Dec 15, 2021, 6:14 PM IST

Jadeja Test Retirement: టీమ్​ఇండియాలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోహిత్ శర్మ- విరాట్​ కోహ్లీ మధ్య వివాదం జరుగుతోందని వార్తలు తొలుత వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య మరో బాంబు పేలింది. ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు జట్టుకు గుడ్​బై చెప్పనున్నాడని రూమర్లు విస్తృతమయ్యాయి. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు సమాచారం అందించాయి. ఈ రూమర్లపై స్పందించాడు జడేజా. అవన్నీ గాలివార్తలే అని రుజువుచేస్తు ఓ ట్వీట్ చేశాడు.

రూమర్ల నేపథ్యంలో టీమ్​ఇండియా టెస్టు జెర్సీ ధరించి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన జడేజా.. 'లాంగ్​ వే టూ గో(ఇంకా చాలా ఆడాల్సి ఉంది)' అని కాప్షన్ జోడించాడు. టెస్టు క్రికెట్​ను ఇప్పుడప్పుడే వదిలేయను అనే ఉద్దేశం తెలియజేసేలా ఈ ట్వీట్​ చేశాడు.

గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జడేజా మోచేతికి గాయమైంది. అదే కారణంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జడేజాను ఎంపిక చేయలేదు. అయితే వీలైనంత త్వరగా జడేజాను టెస్టు క్రికెట్లో చూడాలనుకుంటున్న అభిమానులకు ఈ రూమర్లు నిరాశను మిగిల్చాయి.

మూడు ఫార్మాట్లలో..

మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాకు జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో రాణిస్తున్న జడేజాకు ఫీల్డింగ్‌లో ఎదురేలేదు. మెరుపు వేగంతో అతను విసిరిన త్రోలు మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు ఎన్నో. ఇప్పటి వరకు 57 టెస్టులాడిన జడేజా 2195 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గానూ జడేజా రికార్డు సృష్టించాడు.

ఇదీ చదవండి:

'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

ABOUT THE AUTHOR

...view details