Jadeja Drop Catch :2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ - న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. ప్రస్తుతం అద్భుతంగా ఆడుతోంది. బ్యాటర్లు రాచిన్ రవీంద్ర, డ్యారీ మిచెల్.. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.
వీరిలో రాచిన్ రవీంద్ర 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. మరోవైపు డ్యారీ మిచెల్ నిలకడగా ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా చేసిన తప్పిదం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది.
క్యాచ్ మిస్ చేసిన జడేజా.. కివీస్ ఇన్నింగ్స్ మహమ్మద్ షమీ వేసిన 11 ఓవర్ ఐదో బంతికి.. రాచిన్ రవీంద్ర నేరుగా జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. కానీ, బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్‌లో ఉన్నా జడేజా క్యాచ్‌ను జారవిడిచాడు. అసాధ్యమైన క్యాచ్‌లను అందుకునే జడేజా.. ఇంత సింపుల్ క్యాచ్‌ను మిస్ చేయడం వల్ల అందరూ షాక్‌కు గురయ్యారు. అసలు క్యాచ్ మిస్ చేసింది జడేజానేనా అని ఫ్యాన్స్ అంటున్నారు.