తెలంగాణ

telangana

ETV Bharat / sports

Pujara: పుజారాకు క్షమాపణలు చెప్పిన ఇంగ్లాండ్ క్రికెటర్

జాతి విద్వేషపూరిత వ్యాఖ్యల ఉదంతంలో టీమ్​ఇండియా క్రికెటర్​​ పుజారాకు (Pujara News) క్షమాపణలు చెప్పాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జాక్ బ్రూక్స్ (Jack Brooks). పుజారాను స్టీవ్​ అని పిలవడం అమర్యాదకరమని తాను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాడు.

cheteshwar pujara news
పుజారా

By

Published : Nov 18, 2021, 9:59 PM IST

టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్ట్​​ పుజారాకు (Pujara News) క్షమాపణలు చెప్పాడు సోమర్​సెట్​ బౌలర్​​ జాక్ బ్రూక్స్ (Jack Brooks). పుజారా యార్క్​షైర్​లో ఆడే సమయంలో అతడికి 'స్టీవ్​' అనే పేరును పెట్టినందుకు చింతిస్తున్నట్లు తెలిపాడు(Jack Brooks Pujara). 2012లో తాను చేసిన జాత్యహంకార ట్వీట్లపైనా కూడా మన్నించాలని కోరాడు.

స్టీవ్​ అనే పదాన్ని పని వాడు అనే అర్థంలో వినియోగించేవారట! ఆసియా సంతతికి చెందిన రెస్టారెంట్ వర్కర్లు, డ్రైవర్లను ఈ పేరుతో పిలిచేవారని తెలిసింది.

"పలకడానికి కష్టంగా ఉండేవారి పేర్లకు బదులు.. 'స్టీవ్'​ అని పిలిచే వాళ్లం. పుజారాను అలాగే పిలిచా. అలా చేయడం అమర్యాదకరం. తప్పు కూడా. ఇప్పుడా విషయంలో పుజారాను క్షమాపణ కోరుతున్నా. 2012లోనూ వివక్షపూరితమైన ట్వీట్లు చేశాను. అది తప్పని తెలుసుకున్నా. నా ట్వీట్లు చూసిన ప్రతిఒక్కరికీ కూడా క్షమాపణలు చెబుతున్నాను."

-జాక్ బ్రూక్స్, ఇంగ్లీష్ క్రికెటర్

కొద్దిరోజుల క్రితం యార్క్​షైర్​ క్రికెట్​ కౌంటీ క్లబ్​పై​ ఇంగ్లాండ్​ క్రికెటర్ అజీమ్​ రఫిక్​ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జాక్​ బ్రూక్స్​ పూజారాకు క్షమాపణలు చెప్పాడు.

ఇదీ చూడండి:Racism in Cricket: మోకాళ్లపై సంఘీభావం తెలిపితే సరిపోదు!

ABOUT THE AUTHOR

...view details