T20 World Cup : టీమ్ ఇండియా ఇంకా గాడిలో పడలేదు. గాయాల సమస్యలు జట్టును వెంటాడుతున్నాయి. టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటని విశ్లేషణలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బ్యాటర్లు రాణించినా బౌలింగ్‌లో పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా పరిస్థితిపై మాట్లాడాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరడానికి కేవలం 30 శాతం అవకాశాలే ఉన్నాయని అన్నాడు.
ఇటీవల వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (74) రాణించినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 168 పరుగులను ఛేదించలేకపోయారు. అక్టోబర్ 17న ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టీమ్‌తో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో గెలిచినా.. టీమ్ ఇండియా ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఆఖరిలో మహ్మద్ షమీ కేవలం నాలుగు పరుగులకు 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం గాయాలే అని స్పష్టమవుతోంది. ఇదే విషయంపై కొత్త ఎన్ని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా అందోళన వ్యక్తం చేశారు. తాను చేయాల్సిన మొట్ట మొదటి పని టీమ్ ఇండియ ప్లేయర్లు గాయాలపాలు కాకుండా చూడడమేనని చెప్పారు. కాగా, టీమ్ ఇండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.