ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పృథ్వీని తీసుకుంటే వారిని అవమానించినట్లే' - కపిల్​దేవ్

ప్రస్తుతం ఉన్న స్క్వాడ్​తోనే టీమ్ఇండియా.. ఇంగ్లాండ్​ పర్యటనలో ఆడాలని సూచించాడు మాజీ క్రికెటర్​ కపిల్​దేవ్. కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. గాయపడిన గిల్ స్థానంలో ప్రత్యామ్నాయం ఉందని తెలిపాడు. అలా కాదని పృథ్వీ షాను టీమ్​లోకి తీసుకుంటే ఇప్పటికే జట్టుతో ఉన్న కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్​ను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డాడు.

kapil dev, former team india captain
కపిల్​దేవ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
author img

By

Published : Jul 4, 2021, 12:28 PM IST

యూకే టూర్​లో ఉన్న టీమ్​ఇండియా టెస్ట్ స్క్వాడ్​లో మరే ఇతర ఆటగాడిని చేర్చుకోవాల్సిన అవసరం లేదని మాజీ ఆల్​రౌండర్​ కపిల్​దేవ్​ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న 20 మందితో ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​ను విజయవంతంగా ముగించవచ్చని పేర్కొన్నాడు. ఇప్పటికే రాహుల్, మయాంక్ అగర్వాల్​ ఓపెనింగ్ స్థానానికి పోటీలో ఉన్నారని.. గాయపడిన గిల్​ స్థానంలో మరో ఆటగాడిని కావాలంటూ టీమ్ఇండియా కోరడం సరైనది కాదన్నాడు.

యువ ఓపెనర్​ గిల్​ గాయపడిన నేపథ్యంలో పృథ్వి షాను జట్టులోకి తీసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ విషయమై బీసీసీఐని కోరింది. పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు షా.

"ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ గాయపడి ఉండొచ్చు. అతని స్థానంలో ప్రత్యామ్నాయంగా అనుభవజ్ఞులైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్.. ఇప్పటికే స్క్వాడ్​లో ఉన్నారు. వీరిద్దరు కాకుండా మరో ఓపెనర్​ అవసరమా? అలా తీసుకుంటే ఇప్పటికే ఉన్న వారిని అవమానించినట్లే అవుతుంది. స్టాండ్​ బై ప్లేయర్​గా అభిమన్యు ఈశ్వరన్​ కూడా అందుబాటులో ఉన్నాడు. ఇది జట్టు యాజమాన్యానికి మంచిది కాదు."

-కపిల్​దేవ్​, టీమ్ఇండియా మాజీ కెప్టెన్.

"ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం సెలక్షన్​ కమిటీ ఓ జట్టును ఎంపిక చేసింది. వారి నిర్ణయాన్ని గౌరవించాలి. టీమ్​ ఎంపికలో కోచ్​ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఒక్క ఆటగాడు గాయపడితే ప్రత్యామ్నాయం ఉంది. ఏదేమైనా ఎంపిక చేసిన స్క్వాడ్​తోనే ఆడాలనేది నా అభిప్రాయం. ఈ విషయంపై వివాదం అనవసరం," అని కపిల్ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి:Team India: ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు పృథ్వీ!

ABOUT THE AUTHOR

...view details