తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్ కోహ్లీ స్థానంపై అనుమానాలు వద్దు'

జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్ కోహ్లీ(virat kohli news) స్థానాన్ని భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag on kohli). కోహ్లీ బ్యాటింగ్​ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని తెలిపాడు.

Kohli
కోహ్లీ

By

Published : Nov 9, 2021, 2:15 PM IST

జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా విరాట్ కోహ్లీ(virat kohli news) స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. చాలాకాలంగా అతడు గొప్పగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో కోహ్లీ(virat kohli news) బ్యాటింగ్‌ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని సెహ్వాగ్‌(virender sehwag on kohli) తెలిపాడు.

"టీమ్ఇండియాలోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్‌ కోహ్లీ(virat kohli news) స్థానాన్ని భర్తీ చేయలేరు. బ్యాటుతో చాలాకాలంగా అతడు గొప్పగా రాణిస్తున్నాడు. అతడికి ఇష్టమొచ్చినంత కాలం టీ20ల్లో ఆడుతూనే ఉంటాడు. అతడు బ్యాటింగ్‌కు దిగే స్థానంపై సందేహాలు అక్కర్లేదు" అని సెహ్వాగ్‌(virender sehwag on kohli) పేర్కొన్నాడు.

మాజీ పేసర్ ఆశిశ్‌ నెహ్రాashish nehra on virat kohli కూడా సెహ్వాగ్ అభిప్రాయాన్ని సమర్థించాడు. "బ్యాటింగ్‌లో కోహ్లీ(virat kohli news) అంత స్థిరత్వంతో ఎవరూ రాణించలేరు. జట్టునిండా పవర్‌ హిట్టర్లుంటే సరిపోదు. కీలక సమయాల్లో జట్టును గట్టెక్కించగల సీనియర్లు కూడా ఉండాలి" అని నెహ్రా అన్నాడు.

2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీ 87 ఇన్నింగ్స్‌లు ఆడి.. 52.05 సగటుతో 3,227 పరుగులు చేశాడు. ఇందులో 29 అర్ధ శతకాలున్నాయి.

ఇవీ చూడండి: ఆర్సీబీ కొత్త కోచ్​గా బంగర్.. రెండేళ్లకు ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details