తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బుమ్రా అలా చేయడు.. పక్కా కోహ్లీ పనే!'

టీమ్‌ఇండియా పేసర్​ జస్ప్రీత్‌ బుమ్రాకు కవ్వించే గుణం లేదని అన్నాడు మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌. ఇంగ్లాండ్​తో జరిగిన లార్డ్స్​ టెస్టులో అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది సారథి కోహ్లీ ప్లాన్​ అయి ఉండొచ్చని అన్నాడు.

kohli
కోహ్లీ

By

Published : Aug 21, 2021, 10:51 PM IST

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఎవరినీ కవ్వించడని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. నిజానికి అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రణాళిక కావొచ్చని అంచనా వేశాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది అతడి ఉద్దేశం కావొచ్చని పేర్కొన్నాడు.

లార్డ్స్‌ టెస్టులో రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్నారు. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన అండర్సన్‌కు బుమ్రా షార్ట్‌పిచ్‌ బంతులు వేయడం వల్ల ఇది మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడం వల్ల జిమ్మీ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేని బూతులు తిట్టాడు. తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఆంగ్లేయులు షార్ట్‌పిచ్‌ల బంతులు విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది బెడిసికొట్టింది.

"పదకొండో బ్యాటరైన అండర్సన్‌కు బుమ్రా 150 మైళ్ల వేగంతో బంతులు వేశాడు. పుల్‌ లెంగ్త్‌, షార్ట్‌పిచ్‌ బంతులతో దేహానికి గురిపెట్టాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదు. అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడు. అలా చేసుంటే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఇంకా త్వరగానే ముగిసేది. షార్ట్‌పిచ్‌ బంతులు వేయాలన్నది బహుశా విరాట్‌ కోహ్లీ ప్రణాళిక అయ్యుంటుంది. దానిని బుమ్రా అమలు చేశాడు. బహుశా ఇంగ్లాండ్‌ ప్రధాన ఆటగాడైన అండర్సన్‌ను రెచ్చగొట్టాలనో లేదా రెచ్చగొట్టి శాంతింపజేయాలనో లేదా అతడిని గాయపర్చాలనో ఇలా చేసుండొచ్చు. దాంతో ఆంగ్లేయులు డీలా పడతారని అనుకోవచ్చు" అని బంగర్‌ అన్నాడు.

ఇదీ చూడండి: 'బుమ్రా సారీ చెప్పినా అండర్సన్​ వినలేదు!'

ABOUT THE AUTHOR

...view details