తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: 'రోహిత్​ కాదు.. నేనే డిక్లేర్‌ చేయమన్నా'

IND VS SL Ravindra jadeja double century: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ ప్రకటించడంపై కెప్టెన్​ రోహిత్​ను విమర్శించారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో దీనిపై జడేజా స్పందించాడు. డిక్లేర్​ చేయాలని స్వయంగా తానే జట్టుకు సందేశం పంపినట్లు తెలిపాడు. ఈ ఇన్నింగ్స్​లో అతడు 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. .

rohith sharma  ravindra jadeja
rohith sharma ravindra jadeja

By

Published : Mar 6, 2022, 6:45 AM IST

IND VS SL Ravindra jadeja double century: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్​లో జడేజా(175*) డబుల్​ సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. డిక్లేర్ ప్రకటించడం వల్లే ద్విశతకం చేజారిపోయిందని ​కెప్టెన్​ రోహిత్​ శర్మపై అభిమానులు విరుచుకుపడ్డారు. కోచ్​ ద్రవిడ్​పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ఆ అవకాశం ఇవ్వాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై జడ్డూ స్పందించాడు. పిచ్‌పై లభిస్తోన్న అస్థిర బౌన్స్‌, టర్న్‌ను సొమ్ము చేసుకోవడం కోసం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలని స్వయంగా తానే జట్టుకు సందేశం పంపినట్లు వెల్లడించాడు. "పిచ్‌పై బంతి అస్థిరంగా బౌన్స్‌ అవుతోందని, డెలివరీలు తిరగడం మొదలైందని చెప్పా. పిచ్‌ సహకరించడం మొదలైన నేపథ్యంలో వెంటనే ప్రత్యర్థిని బ్యాటింగ్‌ దించాలని సూచించా. ప్రత్యర్థి బ్యాటర్ల అలసటను సొమ్ము చేసుకోవాలనుకున్నాం" అని జడేజా చెప్పాడు.

జడ్డూ రికార్డు

టెస్టుల్లో జడేజాకిదే అత్యధిక స్కోరు. ఏడో స్థానంలో ఓ భారత బ్యాట్స్‌మన్‌ సాధించిన అత్యధిక పరుగులు కూడా ఇవే. కపిల్‌ దేవ్‌ 1986లో శ్రీలంకపైనే 163 పరుగులతో నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు.

అశ్విన్‌ టెస్టు వికెట్ల సంఖ్య. న్యూజిలాండ్‌ దిగ్గజం రిచర్డ్‌ హ్యాడ్లీ (431)ను అతను దాటేశాడు.

వందో టెస్టు ఆడుతున్న విరాట్‌ కోహ్లి తొలి రోజు బ్యాటింగ్‌కు వచ్చినపుడు అభిమానులు సాదర స్వాగతం పలికితే.. రెండో రోజు ఫీల్డింగ్‌ కోసం మైదానంలో అడుగు పెట్టిన అతడిని సహచరులు ఇలా స్వాగతించారు.

జడ్డూ చాలా దాచాడే..

రవీంద్ర జడేజా అంటే ప్రధానంగా అతడి బౌలింగ్‌ మీదే దృష్టి ఉండేది ఒకప్పుడు. బ్యాటింగ్‌లో రాణిస్తే అది బోనస్‌గా భావించేవాళ్లు. అతణ్ని నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా పరిగణించడానికి వెనుకాడేవాళ్లు. కానీ ఇప్పుడు కథ మారుతోంది. బ్యాటింగ్‌లో అసాధారణ ప్రదర్శనతో తనపై అభిప్రాయాన్ని మార్చేస్తున్నాడు జడ్డూ. బౌలింగ్‌లో రాణిస్తూనే.. బ్యాట్స్‌మెన్‌గా తన ప్రతిభను బయటికి తీస్తున్న వైనం అనూహ్యం. జడ్డూ ఇంత బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ఇన్నాళ్లూ దాచుకున్నాడా అని అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇటు అంతర్జాతీయ క్రికెట్లో, అటు ఐపీఎల్‌లో జడేజా బ్యాటుతో నిలకడగా రాణిస్తున్నాడు. ఇంతకుముందు లోయర్‌ మిడిలార్డర్లో బ్యాటింగ్‌ చేసే అతణ్ని ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో 5, 6 స్థానాల్లో ఆడించడానికి కారణం ఈ నిలకడే. ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను మించి వీర విహారం చేసి ఔరా అనిపించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో మూడు ట్రిపుల్‌ సెంచరీలు బాదిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో తన బ్యాటింగ్‌ ప్రతిభకు న్యాయం చేయట్లేదనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఇన్నాళ్లకు అతను ఒక భారీ ఇన్నింగ్స్‌తో బ్యాట్స్‌మన్‌గా తన స్థాయిని చాటిచెప్పాడు. శనివారం జడేజా ఉన్న ఊపులో ఇంకో మూణ్నాలుగు ఓవర్లు ఆడి ఉంటే డబుల్‌ సెంచరీ కూడా పూర్తయి ఉండేది. కానీ అప్పటికే స్కోరు 570 దాటిపోవడం, చివరి సెషన్లో ప్రత్యర్థి వికెట్లు వీలైనన్ని తీస్తే మ్యాచ్‌పై పట్టు బిగుస్తుందన్న ఉద్దేశంతో జడేజానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలని కెప్టెన్‌కు సూచించి వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చాటాడు. నిఖార్సయిన ఆల్‌రౌండర్లు ఉంటే ఏ జట్టుకైనా అది పెద్ద బలమే. భారత్‌కు ఆ బలం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడు జడేజా ఈ స్థాయిలో రాణించడం మంచి పరిణామం. అతడితో పాటు అశ్విన్‌ కూడా బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తుండటం జట్టు బ్యాటింగ్‌ లోతును పెంచేదే.

ఇదీ చూడండి: Shane Warne: అలాంటి కళాత్మకత వార్న్‌కే సాధ్యం!

ABOUT THE AUTHOR

...view details