ఉన్ముక్త్ చంద్.. భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్. సారథిగా, బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. మరి ఇంకేముంది. భారత జట్టులో చోటే తరువాయి. కానీ, ఈ యువ ఆటగాడికి ఇంతవరకు బీసీసీఐ నుంచి పిలుపు రాలేదు. అటు దేశవాళీల్లోనూ అవకాశాలు రాక విసిగిపోయాడు. దీంతో విదేశీ లీగ్‌లే సరైనవని భారత్‌లో ఆటకు వీడ్కోలు ప్రకటించాడు.
"గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. చివరి సీజన్లో దిల్లీ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. టీమ్‌లో సహచరులు కనీసం నన్ను గుర్తించలేదు. వారంతా మైదానంలో ఆడుతుంటే.. నేను డగౌట్‌కు పరిమితమవ్వాల్సి వచ్చింది. ఒంటరిగా పెవిలియన్‌లో కూర్చొవడం మానసిక క్షోభలా అనిపించింది. ఇది మెంటల్‌గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. రానురాను ఇక అవకాశాలు వస్తాయో లేదో అని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది"
-ఉన్ముక్త్ చంద్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
విదేశీ లీగ్‌ల కోసం యూఎస్‌ను ఎంచుకోవడంపై ఉన్ముక్త్ స్పందించాడు. అక్కడి పరిస్థితులు అన్ని అంచనా వేశాకే ఓ నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నాడు. 'మూణ్నెళ్ల క్రితం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి క్రికెట్‌ను దగ్గర నుంచి చూశాను. పలు మ్యాచ్‌లు ఆడాను. అక్కడి ఆటపై ఓ స్పష్టత వచ్చాక ఆడాలనుకున్నా. ఇప్పటికే కోరె అండర్సన్, స్మిత్ పటేల్, హర్మీత్ సింగ్ వంటి ప్లేయర్లు యూఎస్ లీగ్‌లలో ఆడుతున్నారు' అని పేర్కొన్నాడు.