Ishan Kishan Shreyas Iyer Break:టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్, అఫ్గానిస్థాన్‌తో జనవరి 11 నుంచి జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. అటు శ్రేయస్ అయ్యర్‌ను కూడా సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. ఇషాన్ 'మానసిక ఒత్తిడి' కారణంగా ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కు వచ్చాడు. అయితే అఫ్గాన్‌తో జరిగే సిరీస్ కోసం అందుబాటులో ఉంటానని ఇషాన్ రీసెంట్గా బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిడట. కానీ, బీసీసీఐ అతడిపై డిసిప్లినరీ చర్యల్లో భాగంగానే అతడిని ఎంపిక చేయలేదని పలు కథనాలు వెలువడుతున్నాయి.
ఆటకు బ్రేక్ తీసుకున్న ఇషాన్ ఇటీవల టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన్నతో కలిసి అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షోలో పాల్గొన్నాడు. అలాగే తాజాగా ఇషాన్ దుబాయ్‌లో ఓ పార్టీలో పాల్గొన్న ఫొటో బయటకు రావడం వల్ల బీసీసీఐ అతడిపై కోపంగా ఉందట. ఫ్యామిలీతో గడిపేందుకు బ్రేక్ తీసుకొని ఇషాన్ ఇలా చేయడం వల్ల మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం కోల్పోయిందంటూ పలు కథనాలు వస్తున్నాయి.
అటు శ్రేయస్ అయ్యర్ కూడా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముందు రంజీ ట్రోఫీ ఆడడం పట్ల అతడిపై బీసీసీఐ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యర్ 2024 రంజీలో ముంబయి తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జనవరి 12న ముంబయి- ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సమయంలో రంజీలో ఆడాలని మేనేజ్మెంట్ అయ్యర్‌కు సూచించిందట. కానీ, అయ్యర్ అప్పుడు నో చెప్పి, తాజాగా ముంబయితో అగ్రిమెంట్ చేసుకోవడాన్ని బీసీసీఐ తప్పుపట్టినట్లు సమాచారం.
అలాంటిదేమీ లేదు:అయితే 'ఇషాన్, అయ్యర్‌ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే పక్కనపెట్టారా?' అన్న ప్రశ్నకు టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రిప్లై ఇచ్చాడు. 'అలా కాదు. ఈ విషయంలో వస్తున్నవన్నీ ఫేక్ వార్తలు. ఇషాన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయ్యర్ ఈ సిరీస్ సెలెక్షన్‌కు దూరంగా ఉన్నాడు' అని ద్రవిడ్ అన్నాడు.