తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ ఏదో చెప్పాడు.. వెంటనే అవుట్​ అయిపోయా' - ధోనీ

Ishan Kishan About Dhoni: ఐపీఎల్​లో ఓసారి తాను బాగా ఆడేటప్పుడు ధోనీ.. బౌలర్​కు ఏదో చెప్పి ఔట్​ చేశాడని చెప్పాడు ముంబయి ఇండియన్స్​ ప్లేయర్​ ఇషాన్​ కిషన్​. ఇప్పటికీ ఎలా ఔటయ్యానో అర్థం కాదని అన్నాడు. ఓ యూట్యూబ్​ ఛానెల్లో మాట్లాడిన ఇషాన్​.. పలు విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

Ishan-kishan-reveals-the-hand-guesture-of-dhoni-while-playing-for-vijay-hazare
Ishan-kishan-reveals-the-hand-guesture-of-dhoni-while-playing-for-vijay-hazare

By

Published : Apr 6, 2022, 7:19 AM IST

Ishan Kishan About Dhoni: ఒకసారి మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఫీల్డింగ్ సెట్‌ చేసే క్రమంలో ధోనీ చేసిన సైగలు తనకు అర్థంకాలేదని ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు. అప్పుడు తనకు ఎక్కడికి వెళ్లాలో అర్థంకాలేదన్నాడు. తాజాగా 'బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' అనే యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడిన ఇషాన్‌.. ధోనీతో తనకు ఎదురైన ఈ ఆసక్తికర విషయం వెల్లడించాడు.

'ఒకసారి నేను విజయ్‌హజారే ట్రోఫీ ఆడుతున్నప్పుడు ధోనీ జట్టులో ఉన్నా. అప్పుడు నేను థర్డ్‌మ్యాన్‌ దిశలో ఫీల్డింగ్‌ చేస్తుండగా మహీ గాల్లో చేతులు ఊపుతూ ఫీల్డర్లను అటు, ఇటు మారమన్నాడు. దాంతో నాకేం అర్థం కాలేదు. పక్కనున్న ఫీల్డర్‌ని.. ధోనీని అడిగి నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పమని అడిగాను. మళ్లీ మహీభాయ్‌ అలాగే చేతులు ఊపి సైగలు చేశాడు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలో అర్థంకాక తికమక పడ్డాను' అని నాటి సరదా ఘటనను గుర్తుచేసుకున్నాడు.

అలాగే ఒకసారి టీ20 లీగ్‌లో తాను బాగా ఆడేటప్పుడు ధోనీ.. బౌలర్‌కు ఏదో చెప్పి ఔట్‌ చేశాడని ఇషాన్‌ చెప్పుకొచ్చాడు. 'ఒకసారి నేను చెన్నై జట్టుపై బాగా ఆడుతున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్ తాహిర్‌ వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు. అది నాకు వినపడలేదు కానీ, మహీభాయ్‌ ఏం చెప్పి ఉంటాడా? అనే ఆలోచనలో పడిపోయా. అయితే, ఇమ్రాన్ వేసిన తర్వాతి బంతికే నేను ఔటయ్యాను. ఇప్పటికీ ఆరోజు ఎలా ఔటయ్యానో అర్థంకాదు. ఇలా కూడా ఒకర్ని ఔట్‌ చేయొచ్చా అనే సందిగ్ధంలో పడిపోయా' అని ముంబయి బ్యాట్స్‌మన్‌ వివరించాడు.

ఇవీ చూడండి:ఒక్క​ ఓటమితో మార్షల్​ ఆర్ట్స్​కు గుడ్​బై.. ఈమె విశేషాలు తెలుసా?

'కుంబ్లే వల్ల యువ క్రికెటర్లు బెదిరిపోయారు: కోహ్లీ'

ABOUT THE AUTHOR

...view details