తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా బ్యాటింగ్ చేయడం సరదా - నా రోల్ ఏంటో నాకు తెలుసు'- ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్న రింకూ, ఇషాన్ - వన్​డౌన్ బ్యాటింగ్​పై ఇషాన్ అభిప్రాయం

Ishan Kishan Ind vs Aus T20 Series : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. వరుసగా రెండో మ్యాచ్​లోనూ ఆసీస్​పై పైచేయి సాధించారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

ishan kishan ind vs aus t20 series
ishan kishan ind vs aus t20 series

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 3:10 PM IST

Ishan Kishan Ind vs Aus T20 Series: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో రెండో మ్యాచ్​లో విజయంతో టీమ్ఇండియా 2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్​లో భారత్ 44 పరుగుల తేడాతో ఆసీస్​ను చిత్తు చేసింది. అయితే మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

బ్యాటింగ్ సరదాగా ఉంది.. యంగ్ డైనమిక్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ సిరీస్​లో అదరగొడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ రెండు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఈ రెండు మ్యాచ్​ల్లో అతడు 3వ స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. సాధారణంగా వైట్​బాల్ క్రికెట్​లో ఇషాన్ ఓపెనింగ్ బ్యాటర్. 2023 ఆసియా కప్​లో జట్టు అవసరాన్ని బట్టి మిడిలార్డర్​లోనూ ఆడాడు. ఈ క్రమంలో తాజా సిరీస్​లో వన్​డౌన్​లో వస్తున్నాడు. దీనిపై ఇషాన్ మాట్లాడాడు.

"వన్​ డౌన్​లో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంటుంది. ఎందుకంటే 3వ స్థానంలో బ్యాటింగ్​కు వెళ్లేటప్పటికి మనకు మ్యాచ్ పరిస్థితి అర్థమవుతుంది. దీంతో మనం ఎలా ఆడలని ప్లాన్ చేసుకుంటామో.. అలా ఆడవచ్చు. కానీ, క్రీజులోకి వెళ్లి స్ట్రైక్ రొటేట్ చేయడం అన్నిసార్లు సాధ్యం కాదు. ఈ మ్యాచ్​లో మొదట్లో నేనూ కొద్దిగా ఇబ్బంది పడ్డా. కానీ, రుతురాజ్​తో నాకు మంచి కమ్యునికేషన్ కుదరడం వల్ల.. బౌలర్లను టార్గెట్ చేయగలిగాం" అని ఇషాన్ అన్నాడు.

లేటెస్ట్ ఫినిషర్.. మరోసారి తన ఫినిషింగ్​తో అందరినీ అలరించాడు రింకూ సింగ్. ఈ మ్యాచ్​లో ఆఖర్లో బ్యాటింగ్​కు దిగిన రింకూ.. కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్​ ముగిశాక రింకూ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "జట్టులో నేను ఎలాగో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్​కు వస్తా. నాకు అది ముందే తెలుసు. ఆ సమయంలో నేను వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా గేమ్​పైనే దృష్టిపెట్టాను. బంతిని సరిగ్గా అంచనా వేసిన తర్వాతే భారీ షాట్ ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. జట్టులో యువ క్రికెటర్లుగా మేము చాలా నేర్చుకుంటున్నాం. ఆఖరి 5 ఓవర్లలో బ్యాటింగ్ చేయడమే నా రోల్. దాని కోసం నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నా" అని రింకూ అన్నాడు.

సారీ చెప్పేశా..తొలి మ్యాచ్​లో సమన్వయం కోల్పోయి, తన వల్ల రుతురాజ్ ఔటయ్యాడని యశస్వి జైశ్వాల్ గుర్తుచేసుకున్నాడు. "ఫస్ట్​ మ్యాచ్​లో రతురాజ్ రనౌటవ్వడంలో నా తప్పే ఉంది. అందుకు నేను రుతు భాయ్​కు సారీ చెప్పాను. రుతురాజ్​ నైస్ పర్సన్" అని జైశ్వాల్ అన్నాడు.

'రింకూలో ఆ టాలెంట్​ గుర్తించింది అతడే' - ధోనీ నుంచే ఆ ట్రిక్ నేర్చుకున్నాడట!

నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్‌ కిషన్‌

ABOUT THE AUTHOR

...view details