తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇషాన్‌ కిషన్‌ మరో విధ్వంసం.. రంజీ ట్రోఫీలో సెంచరీ.. దుమ్మురేపుతున్నాడుగా.. - సెంచరీ బాదిన ఇషాన్​ కిషన్​

టీమ్​ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్​ సెంచరీ సాధించి వారం కూడా కావట్లేదు. ఇంతలోనే రంజీ ట్రోఫీలో శతకం బాది ఔరా అనిపించుకుంటున్నాడు.

ishan kishan
ఇషాన్‌ కిషన్‌

By

Published : Dec 15, 2022, 10:03 PM IST

Ishan Kishan Ranji Trophy : ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ డబుల్ సెంచరీ (210) బాదిన సంగతి తెలిసిందే. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ ఇదే. ఇప్పటి వరకు క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు.

వన్డేల్లో సెంచరీ చేయకుండా డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇషాన్‌ ద్విశతకం సాధించి వారం కూడా కావట్లేదు. ఇంతలోనే రంజీ ట్రోఫీలో శతకం బాదేశాడు. ఝార్ఖండ్‌ ‌, కేరళ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ (132; 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో తన ఆరో శతకాన్ని నమోదు చేశాడు ఝార్ఖండ్‌ డైనమెట్.

ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికి ఝార్ఖండ్‌ 114/4 స్కోరుతో కష్టాల్లో ఉంది. సౌరభ్‌ తివారీ (97)తో జట్టు కట్టి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. వీరిద్దరూ కేరళ బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఐదో వికెట్‌కు 200కు పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఝార్ఖండ్‌ 340 పరుగులకు ఆలౌటైంది. నాలుగు రోజుల ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కేరళ ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.

ABOUT THE AUTHOR

...view details