తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ బ్యాటింగ్​ ఆర్డర్​తో ట్రై చేయండి.. గెలుపు మనదే' - హర్భజన్ సింగ్ హార్దిక్ పాండ్యా

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో టీమ్ఇండియా తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh latest tweet). కాకపోతే జట్టులోని బ్యాటింగ్​ ఆర్డర్​లో పలు మార్పులు చేయాలని సూచించాడు.

harbhajan
హర్భజన్

By

Published : Oct 26, 2021, 5:32 AM IST

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో పాకిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్​లోనే ఓటమిపాలై అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది టీమ్ఇండియా. జట్టు ఓటమిపాలవడానికి కారణం కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ అంటూ పలు విమర్శలు వచ్చాయి. ఫామ్​లో ఉన్న ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్​ను పక్కనపెట్టడం ఏంటని కొందరు ప్రశ్నించారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh latest tweet).. ప్రపంచకప్​లో టీమ్ఇండియా పుంజుకోవాలంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్​ను పరిశీలించాలని సూచించాడు. అదేంటో చూద్దాం.

"ఈ విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతున్నా. ఇషాన్ కిషన్​కు ఆడే అవకాశం ఇవ్వండి. అతడు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్​గా రావాలి. కోహ్లీ మూడు, రాహుల్ నాలుగు, పంత్ ఐదో స్థానంలో దిగాలి. హార్దిక్​ ఆరో స్థానంలో బ్యాటింగ్​కు​ వస్తే బాగుంటుంది. పాక్​పై విఫలమైనా.. అతడు మ్యాచ్ విన్నర్. జడేజా ఏడులో రావాలి. శార్దూల్ ఠాకూర్​ను 8వ స్థానంలో దించాలి. ఇతడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లోనూ నిరూపించుకున్నాడు. కాబట్టి శార్దూల్​కు ఓ అవకాశం ఇవ్వాలి. బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి చివర్లో రావాలి."

-హర్భజన్, వెటరన్ స్పిన్నర్

పాకిస్థాన్​(ind vs pak t20)పై భారత్ ఓటమిపైనా స్పందించాడు హర్భజన్. "పాక్​పై ఓడిపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇలాంటి టోర్నీలో గొప్ప ఆరంభం లభించాల్సింది. అయినా ఈ ఓటమితో దారులు పూర్తిగా మూసుకుపోలేదు. మన జట్టు బలంగా ఉంది. గొప్పగా పుంజుకుంటారని భావిస్తున్నా. చేసిన తప్పులను సరిదిద్దుకుని తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కుతారని అనుకుంటున్నా" అంటూ భారత్​కు మద్దతుగా నిలిచాడు భజ్జీ.

భారత్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లు బాబర్ అజామ్ (68*), రిజ్వాన్ (79*) 17.5 ఓవర్లలో ఛేదించారు.

ఇవీ చూడండి: IPl New Teams: 'కొత్త జట్లతో దేశవాళీ క్రికెటర్లకు మేలు'

ABOUT THE AUTHOR

...view details