గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాక వరుస అవకాశాలు ఇస్తున్నా టీమ్ఇండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. న్యూజిలాండ్ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్నా ఇషాన్.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20లోనూ తక్కువ స్కోర్‌కే.. 3 బంతుల్లో ఒకే పరుగు చేసి ఔటయ్యాడు. ఇక ఔట్ అయ్యాకు రివ్యూని కూడా వేస్ట్ చేశాడు.
ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 5, రెండో మ్యాచ్‌లో 8 నాటౌట్, మూడో వన్డేలో 17 పరుగులు చేసిన ఇషాన్.. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో వరుసగా 4, 19, 1 స్కోర్లకే ఔటై అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు. దీంతో భవిష్యత్తులో జట్టులో చోటు విషయాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ (37, 2, 1 )పేలవ ప్రదర్శన చేశాడు. మొత్తంగా ఇషాన్ టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన గత 9 మ్యాచ్‌ల్లో ప్రదర్శన చూస్తే.. కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు.